హైదరాబాద్ : పదో తరగతి పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. కరోనా కారణంగా రెండేండ్ల తర్వాత జరుగుతున్న ఎగ్జామ్స్ కావడంతో అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. సోమవారం ఫస్ట్ లాంగ్వేజీ ఎగ్జామ్ కు మొత్తం 99% స్టూడెంట్లు అటెండ్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా రెగ్యులర్ స్టూడెంట్లు 5,08,143 మందికి గానూ 5,03,041 మంది హాజరయ్యారు. 5,102 మంది అటెండ్ కాలేదు. ప్రైవేటు స్టూడెంట్లు 158 మందికి గానూ 89 మందే హాజరయ్యారు. తొలిరోజు మాల్ ప్రాక్టిస్ కేసులు నమోదు కాలేదు. ఉదయం 8గంటల నుంచే పరీక్షా కేంద్రాల వద్ద సందడి మొదలైంది. తొలిరోజు తెలుగు పేపర్ ఈజీగా వచ్చిందని స్టూడెంట్లు, టీచర్లు చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm