హైదరాబాద్ : నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ ఏడుకోట్ల తండ వద్ద అద్దంకి - నార్కట్ పల్లి రహదారిపై మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను కారు ఢీకొనడంతో... బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వ్యక్తిని మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm