హైదరాబాద్: సంచలనం సృష్టించిన బేగం బజార్ నీరజ్ హత్య కేసులో మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితులు అభినందన్, మహేష్‌లను నాందేడ్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఒక మైనర్‌తో పాటు ఆరుగురు నిందితులు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. గతంలో అరెస్ట్ అయిన నలుగురిని పోలీసులు ఏడు రోజుల పాటు కస్టడీకి కోరారు. పోలీసుల కస్టడీ పిటిషన్‌పై నేడు కోర్టులో విచారణ జరుగనుంది. ప్రేమ, పెళ్లి, పరువు వ్యవహారమే నీరజ్ హత్యకు కారణంగా పోలీసులు తెలిపారు. పరువు కోసమే హత్య చేశామని ఇప్పటికే నిందితులు ఒప్పుకున్న విషయం తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm