హైదరాబాద్ : నగరలోని తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని, రాజీవ్ రహదారి పై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని వెనుక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఈ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతిడిని కుష్బుసింగ్ గా గుర్తించారు. వయసు 31సంవత్సరాలు... స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనకు సంబందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm