హైదరాబాద్ : రెడ్డిల చేతిలో అధికారం ఉండాలన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై భట్టి, వీహెచ్ ఇతర నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రశ్నించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. రేవంత్ పగటి కలలు కంటున్నారని విమర్శించారు. తెలంగాణ డెవలప్‌మెంట్ బోర్డ్ పెట్టాలని ఆనాడే తాము కోరామని... హైదరాబాద్‌కు సుంకిషాల నీళ్లు తేవాలంటే పట్టించు కోలేదన్నారు. ఇప్పుడు రేవంత్ వచ్చి ఏం చేస్తారని ప్రశ్నించారు. పార్థ సారథి రెడ్డి మార్కెట్ రేట్ ప్రకారమే రెమిడెసివర్ ఇచ్చారన్నారు. ఆయన అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని.. అలాంటి వ్యక్తి మీద జగ్గారెడ్డి బురద జల్లడం సరికాదన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm