హైదరాబాద్ : అవినీతికి పాల్పడిన పంజాబ్ మంత్రిపై ఆ రాష్ర్ట సీఎం భగవంత్ మాన్ వేటు వేశారు.
రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విజయ్ సంగ్లా కాంట్రాక్టులకు సంబంధించి ఒక శాతం కమిషన్ డిమాండ్ చేస్తున్నారంటూ స్పష్టమైన ఆధారాలు లభించాయి. ఈ మేరకు పంజాబ్ పోలీసుల అవినీతి నిరోధక విభాగం సింగ్లాను అరెస్టు చేసింది. అనంతరం మంత్రిని డిస్మిస్ చేస్తున్నట్టు సీఎం భగవంత్ మాన్ ప్రకటించారు. తమ ప్రభుత్వం అవినీతికి తావు లేకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మాన్ తెలిపారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. 'మంత్రిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాను. ఆయనను మంత్రివర్గం నుంచి తొలగిస్తున్నాను. అవినీతి కేసులో అతని ప్రమేయానికి సంబంధించి మాకు గణనీయమైన రుజువు దొరికింది. రెండు నెలల్లో అవినీతి ఆరోపణలపై ఓ మంత్రిని తొలగించారని ప్రతిపక్షాలు మాపై విరుచుకుపడినా పట్టించుకోమూ. ఎవరైనా ఇలాంటి దుష్ప్రవర్తనలకు పాల్పడితే మేము సహించము. అవినీతిని సహించేది లేదని మా పార్టీ జాతీయ కన్వీనర్ స్పష్టం చేశారు. 2015లో ఢిల్లీలో అవినీతి ఆరోపణలు రావడంతో ఆయనే స్వయంగా ఓ మంత్రిని తొలగించారు` అని పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 24 May,2022 02:31PM