ఖమ్మం : ఖమ్మం నగరంలోని ఎన్‌ఎస్‌పీ క్యాంపులో రూ.1.10 కోట్లతో నిర్మించిన గిరిజన భవన్ ను గిరిజన శాఖ మంత్రి సత్వతి రాథోడ్‌తో కలిసి మంత్రి పువ్వాడ మంగళవారం ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి గిరివికాస పథకం కింద జిల్లా వ్యాప్తంగా మంజూరైన 243 మందికి బోర్ వెల్స్, ట్యూబ్ వెల్స్- 61 ఆయా లబ్దిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి అజయ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రెండో స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ ను రఘునాథపాలెంలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అలాగే నీట్ కోచింగ్ కూడా ఇక్కడే ఇస్తామని స్పష్టం చేశారు. అడిగిన వెంటనే సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లాకు మెడికల్ కాలేజీ ఇచ్చారని... త్వరలో సీఎం కేసిఆర్ చేతుల మీదుగా మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేస్తామన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 24 May,2022 02:38PM