హైదరాబాద్ : ఓ వింత కేసులో గొర్రెకు మూడేండ్ల పాటు జైలు శిక్ష విధించింది కోర్టు. ఇది మన దేశంలో కాదు ఆఫ్రికాలోని సౌత్ సుడాన్ లో. ప్రస్తుతం ఈ వార్త వైరలవుతోంది. వివరాల్లోకెళ్తే.. సౌత్ సుడాన్ లోని మాన్యాంగ్ ధాల్ లో అకుల్ యోల్ ప్రాంతంలో.. ఆదియు చాంపింగ్ (45) అనే మహిళపై, ఒక గొర్రె దాడిచేసింది. దాంతో మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమెను వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆమెను చూసిన వైద్యులు.. ఆమె పక్కటెముకలు విరిగిపోయాయని, అప్పటికే చనిపోయిందని తెలిపారు. దాంతో బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే సదరు గొర్రె మృతి చెందిన మహిళ సమీప బంధువు రామ్ అనే వ్యక్తిది. అయితే గొర్రెను, దాని యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో ప్రవేశ పెట్టారు. అయితే, విచారించిన కోర్టు.. ఈ ఘటనకు కారణమైన గొర్రెకు మూడేండ్ల పాటు జైలు శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది. గొర్రె యజమానిని నిర్దోషి అని తేల్చింది. అయితే, మరణించిన మహిళ కుటుంబానికి , ఐదు ఆవులను పరిహరంగా ఇవ్వాలని గొర్రె యజమానిని కోర్టు ఆదేశించింది. ఇక మూడేండ్ల శిక్ష కాలంలో, గొర్రె సౌత్ సుడాలన్ లోని లేక్ స్టేట్ లోని ఆడ్యూల్ కౌంటి సైనిక శిబిరంలో ఉంటుందని కోర్టు పేర్కొంది. మూడేండ్ల శిక్ష పూర్తయ్యాక.. బాధిత కుటుంబానికి గొర్రె చెందుతుందని కోర్టు తెలిపింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 24 May,2022 03:15PM