ముంబై : అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్ లో ఉన్నాడంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌తో జరిపిన విచారణలో అతని మేనల్లుడు అలీషా పార్కర్ ఇటీవల వెల్లడించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.దావూద్ ప్రస్తుతం కరాచీలో ఉన్నారని పార్కర్ పేర్కొన్నట్లు ఈడీ తన ఛార్జ్ షీట్‌లో పేర్కొందని సమాచారం. దావూద్ సోదరి హసీనా పార్కర్ కుమారుడైన అలీషా తాను దావూద్‌తో టచ్‌లో లేనని చెప్పాడు. తాజాగా ఈడీ ముంబై కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. ఇదే కేసులో ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ కూడా విచారణను ఎదుర్కొంటున్నారు.
మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరుకావాలని అలిశా పార్కర్కు పలుమార్లు సమన్లు జారీ చేసింది ఈడీ. ఈ క్రమంలోనే అదుపులోకి తీసుకుని విచారించగా.. దావూద్ కరాచీలోనే ఉన్నట్లు అతడు తెలిపాడు. 'నేను పుట్టక ముందే దావూద్ ముంబయి వదిలి వెళ్లాడు. అతను 1986 వరకు దంబర్వాలా భవన్లో నివసించాడు. దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్లో ఉన్నట్లు చాలా మంది మా బంధువుల ద్వారా తెలిసింది. వాళ్లు భారత్ను విడిచివెళ్లినప్పుడు నేను ఇంకా పుట్టనేలేదు. వారితో నేను, నా కుటుంబం కాంటాక్ట్లో లేము. కానీ, కొన్నిసార్లు ఈద్, ఇతర పండుగలకు దావూద్ భార్య మెహ్జబీన్.. నా భార్య ఆయేషా, నా సోదరినులతో మాట్లాడినట్లు తెలుసు.` అని అలిశా పార్కర్ చెప్పినట్లు పేర్కొన్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 24 May,2022 03:33PM