న్యూఢిల్లీ : హిజాబ్ ధారణకు తాను వ్యతిరేకం కాదని ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ విజేత నిఖత్ జరీన్ అన్నారు. ఆంగ్ల మీడియాతో జరీన్ మాట్లాడుతూ ... ఒకరి వేషధారణ పూర్తిగా వారి ఎంపికకు సంబంధించినది అని చెప్పారు. హిజాబ్ వారిష్టమని, దానిపై తానేమీ వ్యాఖ్యానించబోనని అన్నారు. తన అభిప్రాయం తనకు ఉంటుందని అన్నారు. వ్యక్తిగతంగా తాను హిజాబ్ ధారణను ఇష్టపడతానన్నారు. తనకెలాంటి అభ్యంతరాలు లేవనీ, తన కుటుంబానికి కూడా ఎలాంటి అభ్యంతరాలు లేవని స్పష్టం చేశారు. కాబట్టి తన గురించి ప్రజలేం అనుకుంటున్నారనే దానితో తనకు సంబంధం లేదని చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm