బందా: ముఖంపై మొటిమల తగ్గకపోవడంతో తనకు పెండ్లి కావడం లేదని మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది.ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బందా జిల్లా బిసంద పోలీస్ సర్కిల్ పరిధిలోని అజిత్ పారా గ్రామంలో వెలుగుచూసింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ యువతికి మొటిమల కారణంగా పెండ్లి కుదరడం లేదు. పెండ్లి చూపులకు వచ్చిన అబ్బాయిలు మొటిమల కారణంగా ఆమెను తిరస్కరించారు. , అనేక చికిత్సలు చేసినా అవి తగ్గలేదు. దాంతో యువతి తీవ్ర మనస్తాపం చెందింది. సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని చనిపోయింది. పశువులకు మేత వేసి ఇంటికి వచ్చిన ఆమె తల్లి, సోదరి అది గమనించి షాక్ కు గురయ్యారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు బిసాండ పోలీస్ సర్కిల్ ఇన్‌ఛార్జ్ కేకే పాండే తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 24 May,2022 03:55PM