అమరావతి : ఓ కారు అదుపుతప్పి విద్యుత్ స్థంబాన్ని ఢీకొన్న ఘటన ఏపీలోని నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది. అయితే కారులోని వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వస్తున్న ఓ కారు నంద్యాల జిల్లాలోని శ్రీశైలం సాక్షిగణపతి ఆలయం సమీపంలో విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ ఐ వెంకటరెడ్డి తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm