ములుగు : ములుగు డీఆర్‌వో ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురికాగా ఆమె గాయపడ్డారు. వివరాల్లోకెళ్తే.. ములుగు డీఆర్‌వో ప్రేమలత మంగళవారం విధులకు హాజరయ్యేందుకు హనుమకొండ నుంచి ములుగుకు వస్తున్నారు. ఈ క్రమంలో ములుగు జిల్లా కేంద్రం పరిధిలో ప్రేమ్‌నగర్ వద్ద వడ్లలోడు ట్రాక్టర్ ఒక్కసారిగా యూ టర్న్ తీసుకోవడంతో వెనుక వస్తున్న కారు ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. దాంతో డీపీఆర్‌వో ఎడమ చేయి విరిగింది. ఆమెను ములుగు ఏరియా వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం ఆమెను వరంగల్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm