హైదరాబాద్ : మధ్యప్రదేశ్‌లోని సెహోర్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హుకుమ్ సింగ్ కరాదా కుమారుడు రోహితాబ్ సింగ్ మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. ఓ వ్యాపారీ కారును తన కారుతో ఢీకొట్టి నానా హంగామా సృష్టించాడు. దాంతో ఆ వ్యాపారి వీడియోను తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అయింది.
వివరాల్లోకెళ్తే.. . మద్యంమత్తులో రోహితబ్ సింగ్ శనివారం రాత్రి ఓ వ్యాపారి దినేష్ అహుజా కారును ఢీకొట్టాడు. దాంతో వ్యాపారవేత్త నష్టపరిహారం కోసం డబ్బు కోరాడు. అయితే రోహితబ్ సింగ్ వ్యాపారితో దురుసుగా ప్రవర్తించాడు. డబ్బులు ఇవ్వడం కుదరదని గొడవకు దిగాడు. దాంతో ఆ వ్యాపారి పోలీస్ స్టేషన్‌కు రావాలని తెలిపాడు. అందుకు రోహితబ్ సింగ్ కత్తితో తన వెంట పరుగెడుతూ తన కారు విండోను బద్దలు కొట్టాడని వ్యాపారి ఆరోపించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 24 May,2022 04:47PM