తిరువనంతపురం : ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఈనెల 25 నుంచి 27 వరకూ తిరువనంతపురంలో జాతీయ మహిళా లెజిస్లేచర్ కాన్ఫరెన్స్ను కేరళ అసెంబ్లీ నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆహ్వానం అందింది. ఈ నెల 26న 'నిర్ణయాత్మక విభాగాల్లో మహిళల ప్రాతినిథ్యం` అనే అంశంపై కవిత ప్రసంగించనున్నారు. అదే అంశంపై ఉత్తరాఖండ్ గవర్నర్ రీటా ఖండూరీ, అన్నీ రాజా సైతం ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి మోడరేటర్‌గా కేరళ ఎంపీ రేమ్యా హరిదాసు వ్యవహరించనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm