హైదరాబాద్ : మదర్సాలను మూసివేయాలంటూ అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. సంఘ్ పరివార్ లలో లాగా మదరసాల్లో విద్వేషాలను నేర్పించడం లేదని అన్నారు. మదరసాల్లో ఆత్మగౌరవం, సానుభూతిని బోధిస్తారని తెలిపారు. అలాగే గణితం, సైన్స్, సోషల్ అన్నీ బోధిస్తారని అన్నారు. హిందూ సంఘ సంస్కర్త రాజా రామ్ మోహన్ రాయ్ చదువుకున్నది కూడా మదరసాలోనే అని చెప్పారు. ఆయన అక్కడ ఎందుకు చదువుకున్నారో సంఘ్ పరివార్ కు అర్థం కాదన్నారు. ముస్లింలు ఈ దేశాన్ని సుసంపన్నం చేశారని చెప్పారు. స్వాతంత్ర్య పోరాటం సమయంలో బ్రిటిషర్లను ముస్లింలు ఎదుర్కొన్నారని... ఆర్ఎస్ఎస్ వాళ్లు బ్రిటిషర్లకు ఏజెంట్లుగా వ్యవహరించారని అన్నారు. చదువులేని సంఘీలకు ఇది అర్థం కాదన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm