హైదరాబాద్ : తెలంగాణలోని 33 జిల్లాల్లో 33 రేడియాలజీ ల్యాబ్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో జెడ్పీ చైర్మెన్ రోజా రాధాకృష్ణ శర్మతో కలిసి ఆయన రేడియాలజీ హబ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రిలో వసతులు పెంచే కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన మేరకు ప్రతి జిల్లా ఆస్పత్రిలో టీ డయాగ్నోస్టిక్ హబ్, రేడియాలజీ హబ్ ప్రారంభిస్తున్నామని తెలిపారు. ప్రతి పీహెచ్ సీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి వచ్చే వారికి 134 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తామన్నారు. రక్త పరీక్షలు, వివిధ రకాల పరీక్షలు ఉండేవని.. పీహెచ్ సీలకు వచ్చే రోగులకు కొంతమందికి గుండెనొప్పితో వస్తే ఈసీజీ, 2డీ ఈకో, ఎక్స్ రే, అల్ట్రా సౌండ్, మెమెగ్రఫీ సేవలు అవసరాలకు అనుగుణంగా ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చిందని చెప్పారు. రాష్ట్రంలోని 33 జిల్లాలో 33 రేడియాలజీ ల్యాబ్ కేంద్రాలు అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. అన్నీ రకాల వైద్య పరీక్షలు పేదలకు అందుబాటులో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉండేలా చేస్తున్నామన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. 'హైదరాబాదు జంట నగరాలలో అదనంగా 10 రేడియాలజీ ల్యాబ్ లు ప్రారంభిస్తున్నాం.గతంలో ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షల కోసం వెళ్తే ప్రయివేటు ల్యాబ్ లకు రాసేవారు. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక పేద ప్రజలకు అండగా ఉంటున్నది. ప్రజలు ప్రయివేటు ఆస్పత్రికి, ప్రయివేటు స్కానింగ్ సెంటర్లకు వెళ్లొద్దు. ఏ వైద్య పరీక్ష కావాలన్నా.. ప్రభుత్వ ఆస్పత్రిలోనే పరీక్షలు చేస్తారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని జిల్లా ఆస్పత్రులలో ఏర్పాట్లు చేస్తున్న దృష్ట్యా ప్రజలు వైద్య సేవలు వినియోగించుకోవాలి.
ప్రభుత్వ ఆస్పత్రిలో నార్మల్ డెలివరీల సంఖ్య పెరగాలి.
అన్నీ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రులలో స్టెమీ కార్యక్రమం ద్వారా 40 వేల రూపాయల విలువ కలిగిన ఇంజక్షన్ ఇస్తూ.. గుండెపోటు రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం. అన్నీ జిల్లాలో స్టెమీ కార్యక్రమం ప్రభుత్వం తీసుకొచ్చింది. 70 ఏండ్లలో కేవలం 3 కళాశాలలు వస్తే.. ఇవాళ 7 ఏండ్లలో 33 మెడికల్ కళాశాలలు తెచ్చుకున్నాం. రాష్ట్రంలోని 8 చోట్ల మెడికల్ కళాశాలలో ఈ విద్యా సంవత్సరంలోనే అడ్మిషన్లు ప్రారంభం చేయనున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేవలం 700 మెడికల్ కళాశాల సీట్లు ఉండేవి. 7 ఏండ్లలో 2840 మెడికల్ కళాశాల సీట్లు పెరిగాయి. రాబోయే రెండేళ్లలో 5240 మెడికల్ సీట్లు పెంపు జరగనున్నది. దేశంలోనే ప్రతీ జిల్లాలో మెడికల్ కళాశాల పెట్టిన ఏకైక రాష్ట్రం కేవలం తెలంగాణ మాత్రమే` అని అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 24 May,2022 06:18PM