హైదరాబాద్ : కులాలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మెన్ మహేశ్వర్రెడ్డి ఖండించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. జూన్ 1, 2 తేదీలలో హైదరాబాద్‌లో తెలంగాణ కాంగ్రెస్ వర్క్‌షాప్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ వర్క్‌షాపులో చింతన్ శిబిర్‌లో తీసుకున్న నిర్ణయాలను చర్చిస్తామన్నారు. ఇక రేవంత్ మాట్లాడింది ఆయన వ్యక్తిగతమని భావిస్తున్నట్టు తెలిపారు. రెడ్లకు, వెలమలకు మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. ఆయన కర్ణాటకలో మాట్లాడింది వక్రీకరించవద్దని కోరారు. సామాజిక న్యాయం కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందన్నారు. కాంగ్రెస్ అన్ని వర్గాలకు.. అన్ని కులాలకు ప్రాధాన్యమిస్తుందని తెలిపారు. వచ్చే 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm