పూణె : మహిళల టీ20 ఛాలెంజ్ టోర్నమెంట్ లో భాగంగా మంగళవారం సూపర్ నోవాస్ తో జరిగిన మ్యాచ్ లో వెలాసిటీ జట్టు ఘన విజయం సాధించింది. 151 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన వెలాసిటీ జట్టు 18.2 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని చేధించింది. ఓపెనర్ షఫాలీ వర్మ (33 బంతుల్లో 51), లారా వోల్వార్డ్ (35 బంతుల్లో 51 నాటౌట్) చెలరేగి ఆడారు. అలాగే కెప్టెన్ దీప్తి శర్మ (24 నాటౌట్) రాణించింది. సూపర్ నోవాస్ బౌలర్లలో డాట్టిన్ 2 వికెట్లు తీసుకోగా, పూజా ఒక్క వికెట్ తీసుకుంది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ నోవాస్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 150 పరుగులు చేసింది.ఆ జట్టు బ్యాటర్లలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (51బంతుల్లో 71 పరుగులు) రాణించింది.
Mon Jan 19, 2015 06:51 pm