హైదరాబాద్ : ఒడిశాలో టమాట ఫ్లూ కలకలం రేపుతోంది. తాజాగా 26 మంది చిన్నారులకు ఈ వ్యాధి సోకింది. చిన్నారులు చేతి, పాదం, నోటి వ్యాధితో బాధపడుతున్నారని, వారి పరిస్థితి నిలకడగా ఉందని ఆరోగ్య అధికారి మంగళవారం తెలిపారు. మొత్తం 36 మంది చిన్నారుల నమూనాలను పరీక్షించగా 26 మందికి ఈ వ్యాధి సోకినట్లు తేలిందని తెలిపారు. ఇప్పటికే ఈ నెల మొదట్లోనే కేరళలోని కొల్లం జిల్లాలోనూ 80 చిన్నారులకు టమాట ఫ్లూ సోకింది.
సాధారణంగా టమోటో ఫ్లూ అని పిలువబడే ఈ అంటు వ్యాధి పేగు వైరస్‌ల వల్ల వస్తుంది. పిల్లలలో ఎక్కువగా వస్తుంది. పెద్దవారిలో ఈ వ్యాధి చాలా అరుదు, ఎందుకంటే వారు సాధారణంగా వైరస్ నుండి రక్షించడానికి తగినంత బలమైన రోగనిరోధక వ్యవస్థలను కలిగి ఉంటారు. చాలా సందర్భాలలో, ఈ వైరల్ అనారోగ్యం జ్వరం, నోటిలో నొప్పి మరియు దద్దుర్లు వంటి లక్షణాలను కలిగి ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ఈ వ్యాధి సోకిన చిన్నారులకు జ్వరం, నోట్లో పుండ్లు, చేతులు, కాళ్లు, పిరుదులపై దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటాయి.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 24 May,2022 07:50PM