అమరావతి : కోనసీమ జిల్లాలో ఉద్రిక్తతం కొనసాగుతోంది. పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా ముమ్మిడివరం ఎమ్మెల్యే సతీష్ బాబు ఇంటికి ఆందోళనకారులు నిప్పంటించారు. కాసేపటి క్రితం ఏపీ మంత్రి పినిపె విశ్వరూప్ ఇంటికి కూడా ఆందోళనకారులు నిప్పు పెట్టిన సంగతి తెలిసిందే. అలాగే ఆ ఇంటి ఫర్నిచర్ ను, ఎస్కార్ట్ వాహనాన్ని ధ్వంసం చేశారు. అయితే ఆందోళనకారులు దాడి చేయకముందే విశ్వరూప్ కుటుంబ సభ్యులు ఇంటినుంచి వెళ్లిపోయారు. పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm