అమరావతి : ఏపీలోని కోనసీమ జిల్లాలో అమలాపురంలో ఆందోళనకారులు తన నివాసానికి నిప్పంటించడంపై ఏపీ మంత్రి పినిపే విశ్వరూప్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. తన ఇంటిని తగలబెట్టడం దురదృష్టకరమని పేర్కొన్నారు. జిల్లాకు పేరు మార్పు నేపథ్యంలో కొన్ని రాజకీయ దుష్ట శక్తులు యువతను రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు. చేతులు జోడించి వేడుకుంటున్నానని, దయచేసి అందరూ సంయమనం పాటించాలని కోరారు. జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడం పట్ల అందరూ గర్వించాలని, ఒకవేళ పేరు మార్పుపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని సూచించారు. అభ్యంతరాలను ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm