దావోస్ : దావోస్ పర్యటనలో ఉన్న తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు అద్బుతమైన ప్రశంస దక్కింది. ఇంకో 20 ఏండ్లలో కేటీఆర్ భారత దేశానికి ప్రధానమంత్రి అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదని అమెరికాకు చెందిన మహిళా వ్యాపారవేత్త ఆశా జడేజా మోత్వాని అన్నారు. ఈ మేరకు ఆమె ఓ ట్వీట్ చేశారు. అన్ని అంశాలపై స్పష్టమైన అవగాహన, భావ వ్యక్తీకరణ ఉన్న ఇలాంటి యువ రాజకీయ నాయకుడిని తన జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు. దావోస్‌లో తెలంగాణ బృందం దూసుకుపోతోందని ప్రశంసించారు. సిలికాన్ వ్యాలీ స్టార్టప్ రోజులను గుర్తుచేశారని ప్రస్తావించారు. భవిష్యత్‌లో బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm