అమరావతి : గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు కూలిన ఘటన ఏపీలోని కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తుగ్గలి మండలం జొన్నగిరిలో ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలింది. దాంతో పేలుడు ధాటికి ఇల్లు కూలింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. శిధిలాల కింద నలుగురు చిన్నారులు చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm