కోల్‌కతా : ఐపీఎల్ లో భాగంగా గుజరాత్ టైటాన్స్ తో జరుగుతున్న క్వాలిఫయర్ 1 మ్యాచ్ లో రాజస్థాన్
రాయల్స్ బ్యాటర్లు చెలరేగి ఆడారు. ఓపెనర్ జాస్ బట్లర్ (53 బంతుల్లో 86, 12 ఫోర్లు, 2 సిక్సర్లు) విజృంభించగా సంజూ సామ్సన్ (26 బంతుల్లో 47, 5 ఫోర్లు, 3 సిక్సర్లు), పడిక్కల్ (20 బంతుల్లో 28, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. దాంతో రాజస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 188 పరుగులు చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 24 May,2022 09:38PM