హైదరాబాద్ : అమెరికాలోని టెక్సాస్‌లో తుపాకి మరోమారు నిప్పులు కక్కింది. ఓ ప్రాథమిక పాఠశాలలోకి చొరబడిన 18 ఏళ్ల యువకుడు విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 18 మంది చిన్నారులు, ఓ టీచర్ కూడా ఉన్నారు. మెక్సికన్ సరిహద్దులోని ఉవాల్డే పట్టణంలోని రోబ్ ఎలిమెంటరీ స్కూల్‌లో జరిగిన ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులందరూ 11 ఏళ్లలోపు వారేనని అధికారులు తెలిపారు. దుండగుడు కాల్పులు జరిపిన పాఠశాలలో 500 మంది కంటే ఎక్కువమందే చదువుకుంటున్నట్టు టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ తెలిపారు. దుండగుడు హ్యాండ్‌గన్‌తో పాఠశాలలోకి చొరబడ్డాడని, అతడి వద్ద రైఫిల్ కూడా ఉండి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. పోలీసుల కాల్పుల్లో నిందితుడు హతమయ్యాడని గవర్నర్ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm