హైదరాబాద్ : పంజాగుట్ట ఎస్హెచ్ఓ నిరంజన్ రెడ్డి సెలవులో వెళ్లగా, అతడి స్థానంలో సీసీఎస్‌లో పని చేస్తున్న ఇన్స్పెక్టర్కు చార్జి ఇచ్చారు. అయితే ఎస్హెచ్ఓ బదిలీపై వెళ్లారని ప్రచారం జరిగింది. మంగళవారం మధ్యాహ్నం ఆయన తిరిగి బాధ్యతలు చేపడుతున్నారన్న సమాచారంతో ఇన్చార్జి ఇన్స్పెక్టర్ పీఎస్‌కు రాలేదు. వాస్తవానికి లీవ్‌పై వెళ్లిన ఇన్స్పెక్టర్ స్థానంలో అదే పీఎస్‌కు చెందిన అధికారికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించాల్సి ఉండగా, సీసీఎస్‌లో పని చేసిన వ్యక్తికి చార్జి ఇవ్వడంతో బదిలీ ప్రచారం జరిగింది. ఇదే డివిజన్‌కు చెందిన ఏసీపీ పరిస్థితి కూడా అలాగే కనిపిస్తోంది. ఆయనను బదిలీ చేస్తూ డీజీపీ ఆదేశాలిచ్చినా ఆయన సీటు వదలకపోవడం, ఆ ఉత్తర్వులు వెనక్కు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఎల్బీనగర్ ఏసీపీ బదిలీ వ్యవహారం బాస్‌లకు తలనొప్పిగా మారిందని ప్రచారం జరుగుతోంది.
Mon Jan 19, 2015 06:51 pm