నల్లగొండ: అభివృద్ధి విషయంలో నల్లగొండ జిల్లాకు అన్యాయం చేస్తూ ఓ పనికిమాలిన మంత్రిని నియమించారని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి భూఅక్రమాలకు, ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో రియల్ ఎస్టేట్ దందా కోసం కలెక్టరేట్ స్థలాన్ని మార్చి వందల కోట్లు సంపాదించారన్నారు. బినామీల పేరుతో తమ సొంత మండల కేంద్రమైన నార్కట్ పల్లి పెద్ద చెరువు 40 ఎకరాల భూమిని కబ్జా చేసి వెంచర్ నిర్మించాలని ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపైన కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామని...సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకుంటే తామే రంగంలోకి దిగుతామని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm