హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలోని అశోక్‌నగర్ ప్రాంతంలోని ఓ విద్యుత్ స్తంభంపై బుధవారం మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. దీంతో స్థానిక ప్రజలు ఆందోళనకు గురయ్యారు. విద్యుదా ఘాతం లేదా అధిక ఉష్ణోగ్రతల వల్ల ఈఘటన జరిగి ఉండొచ్చని స్థానికులు అంటున్నారు. ఈ విషయమై ఏడీఈ జీవన్‌ను ప్రశ్నించగా విద్యుత్ స్తంభంపై ఉన్న ఓ ఇంటి సర్వీస్ వైర్ కారణంగా విద్యుదాఘాతం ఏర్పడిందన్నారు. సమాచారం తెలియగానే సిబ్బంది సమస్యను పరిష్కరించారని వివరించారు.
Mon Jan 19, 2015 06:51 pm