హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ ప్రాజెక్ట్ రానుంది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కానుంది. దావోస్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో ప్రభుత్వంతో స్టాడ్లర్ రైల్ కంపెనీ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. రూ.1000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు కంపెనీ మందుకొచ్చింది. ఈ ప్రాజెక్ట్‌తో దాదాపు 2500 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. మేదో సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ , స్టాడ్లర్ రైల్ కలిసి ఈ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని స్థాపించనున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm