శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. అలాగే ఒక పోలీసు అమరుడయ్యారు. వివరాల్లోకెళ్తే.. బారాముల్లా జిల్లా క్రీరీ ప్రాంతంలోని నజీభట్ క్రాసింగ్ వద్ద బుధవారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు పాకిస్థాన్ ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. అలాగే ఒక పోలీసు అమరుడయ్యారు.