అమరావతి : ప్రవాస భారతీయ పారిశ్రామికవేత్త లక్ష్మి మిట్టల్ కుటుంబం ఆధ్వర్యంలోని ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా కంపెనీ ఏపీలో పెట్టుబడులు పెట్టనుంది. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో భాగంగా మంగళవారం ఏపీ సీఎం జగన్‌తో ఆర్సెలర్ మిట్టల్ కంపెనీ చైర్మన్ ఆదిత్య మిట్టల్ భేటీ అయ్యారు. ఈ మేరకు ఏపీలోని కర్నూలు జిల్లా ఓర్వకల్లు పరిధిలో ఇటీవలే గ్రీన్‌కో నేతృత్వంలో ఏర్పాటైన ప్రపంచంలోనే అతిపెద్దదైన రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులో భాగస్వామిగా చేరినట్టు పేర్కొంది. అందులో తన వాటాగా ఏకంగా రూ.4,600 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్టు ఆ కంపెనీ ప్రకటించింది.
అలాగే విశాఖలోని తన ప్లాంట్ విస్తరణ నిమిత్తం రూ.1,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఇప్పటికే ఆ కంపెనీ అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ పెట్టుబడిపైనా ఆ కంపెనీ అధికారికంగా బుధవారం ప్రకటన చేసింది. ఈ రెండు పెట్టుబడుల ద్వారా ఏపీలో తన పెట్టుబడి రూ.5,600 కోట్లకు చేరినట్లు ఆర్సెలర్ మిట్టల్ కంపెనీ తెలిపింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 25 May,2022 03:12PM