హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ షెడ్యూల్ ఖరారైంది. గురువారం మధ్యాహ్నం 1.25 గంటలకు ప్రధాని మోడీ హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ ప్రధానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ర్ట మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలకనున్నారు. అనంతరం గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్- ఐఎస్బీ వార్షికోత్సవంలో ప్రధాని ముఖ్య అతిథిగా పాల్గొంటారు. అక్కడ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అలాగే ఐఎస్‌బీ మైస్టాంప్, ప్రత్యేక కవర్‌ను వారు విడుదల చేస్తారు. గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థులకు ప్రధాని మోడీ పతకాలను అందజేస్తారు. అనంతరం సాయంత్రం 3.55 గంటలకు ప్రధాని మోడీ తిరుగు ప్రయాణం కానున్నారు. తిరుగు ప్రయాణంలో ప్రధానికి మంత్రి తలసాని వీడ్కోలు పలుకుతారు.
ఇదిలా ఉండగా తెలంగదణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ప్రధాని మోడీ పర్యటనకు దూరంగా ఉండనున్నారు. గురువారం ఆయన బెంగళూరులో పర్యటించనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 25 May,2022 03:45PM