హైదరాబాద్ : ఉత్తరాఖండ్లోని పౌరీ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బోనులో పట్టుబడిన చిరుతను కొందరు సజీవదహనం చేశారు. మంగళవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి 150 మందిపై అధికారులు కేసులు నమోదు చేశారు.
వివరాల్లోకెళ్తే.. జిల్లాలోని సప్లోరీ గ్రామంలో ఈనెల 15న గ్రామానికి చెందిన సుష్మాదేవి(47) అనే ఓ మహిళ అడవిలోకి వెళ్లగా ఆమెపై చిరుత దాడి చేసి చంపింది. దాంతో అప్రమత్తమైన అధికారులు.. చిరుతను పట్టుకునేందుకు బోను ఏర్పాటు చేశారు. ఈనెల 24న చిరుత ఆ బోనులో చిక్కింది. ఈ విషయం తెలుసుకున్న అధికారులు చిరుతను నాగదేవ్ రేంజ్ ఆఫీసుకు తరలిస్తుండగా.. సప్లోడీ సహా సార్నా, కుల్మోరీకు చెందిన సుమారు 150 మంది వారిని అడ్డుకున్నారు. చిరుత దాడిలో మహిళ మృతి చెందడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో చిరుత ఉన్న బోనుపై పెట్రోల్ పోసి నిప్పటించారు. దాంతో చిరుత సజీవదహనమైంది. ఈ ఘటనపై ఆ సమయంలో అక్కడున్న అధికారి సతీష్ చంద్ర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. సప్లోడీ సర్పంచ్ అనిల్ కుమార్ సహా దేవేంద్ర, హరి సింగ్ రావత్, సరితా దేవీ సహా సప్లోడీ, సార్నా, కుల్మోరీ గ్రామాలకు చెందిన 150 మందిపై అధికారులు కేసు నమోదు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 25 May,2022 04:33PM