హైదరాబాద్ : ఏపీలోని కోనసీమ జిల్లాలో అల్లర్లకు పాల్పడిన 46 మందిని అరెస్ట్ చేసినట్టు ఆ రాష్ర్ట హోం శాఖ మంత్రి తానేటి వనిత తెలిపారు. బుధవారం డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డితో వారు సమీక్షించారు. అనంతరం విలకరులతో మాట్లాడుతూ.. అల్లర్లలో సంఘ విద్రోహ శక్తులతో పాటు రౌడీ షీటర్లు కూడా ఉన్నారని తెలిపారు. హింసకు పాల్పడిన ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నామని..ఘటన వెనుక ఎవరు ఉన్న కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటివరకు అల్లర్లకు పాల్పడిన 46 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. అల్లర్లలో గతంలో 7కు పైగా కేసులు నమోదైన వారు 72 మంది ఉన్నారని చెప్పారు. ప్రస్తుతం కోనసీమ జిల్లా.. ప్రత్యేకించి అమలాపురంలో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని తెలిపారు. జిల్లాలో మరోమారు ఆందోళనలు జరగకుండా అదనపు బలగాలను మోహరించామన్నారు. మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యే సతీశ్ ఇండ్లపై దాడికి దిగిన వారు కూడా అరెస్టయిన వారిలో ఉన్నారన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm