హైదరాబాద్ : తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ముందుకువసున్నాయి. దావోస్ వేదికగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పలు కంపెనీలు పెట్టుబడులు పెడుతామని ప్రకటించాయి. తాజాగా
తెలంగాణలో మరో యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ష్నైడర్ ఎలక్ట్రిక్ కంపెనీ ప్రకటించింది.
దావోస్‌లో మంత్రి కేటీఆర్‌తో ష్నైడర్ కంపెనీ ప్రతినిధి భేటీ అయ్యారు. అనంతరం ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రెండో యూనిట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా ష్నైడర్ కంపెనీ ప్రతినిధులకు కేటీఆర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 25 May,2022 05:15PM