హైదరాబాద్ : అక్కినేని నాగచైతన్య హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం థ్యాంక్యూ. రాశీఖన్నా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను మేకర్స్ బుధవారం కాసేపటి క్తితం విడుదల చేశారు. మాళవికా నాయక్, అవికాగోర్ లు కూడా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలు పోషించినట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా జులై 8న థియేటర్లలో విడుదల కాబోతున్నది.
Mon Jan 19, 2015 06:51 pm