హైదరాబాద్ : ప్రధాని నరేంద్ మోడీ హైదారబాద్ పర్యటన నేపథ్యంలో బేగంపేట విమానాశ్రయాన్ని ఎస్పీజీ తన అధీనంలోకి తీసుకుంది. అలాగే భద్రతలో పాల్గొనే సిబ్బందికి అధికారులు కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. ప్రధాని గురువారం మధ్యాహ్నం 1:25 గంటలకు బేగంపేట విమానాశ్రయం చేరుకుని.. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా హెచ్‌సీయూకి చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఐఎస్‌బీకి వెళ్తారు. అయితే అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా రోడ్డు మార్గాన్ని అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు బేగంపేట విమానాశ్రయం నుంచి ఐఎస్‌బీ వరకు పీఎంవో భద్రతా విభాగం ట్రయల్ రన్ నిర్వహించింది.
Mon Jan 19, 2015 06:51 pm