హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అటవీ అధికారి శ్యామ్.. అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికాడు. వివరాల్లోకెళ్తే.. శంషాబాద్ కోత్వాల్‌గూడలో టింబర్ డిపో అనుమతి కోసం అటవీ అధికారి లంచం అడుగుతున్నారని సికింద్రాబాద్ తార్నాకకు చెందిన వెంకటేశ్ అనే వ్యక్తి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. రూ.80 వేలు లంచం అడిగినట్టు తెలిసింది. ఈ మేరకు ఏసీబీ అధికారులు.. అటవీ అధికారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.ఎఫ్‌ఆర్‌వోతో పాటు విరియా నాయక్ అనే వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఎఫ్‌ఆర్‌వో కార్యాలయంతో పాటు అతని నివాసంలో అధికారులు సోదాలు నిర్వహించారు.
Mon Jan 19, 2015 06:51 pm