పనాజీ : ఓ బంగ్లాలోకి చొరబడిన కొందరు దొంగలు రూ. 20 లక్షలకు పైగా విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. చాలా విచిత్రం ఏమిటంటే, దొంగలు ఇంటి యజమానికి 'ఐ లవ్ యు` అని ప్రపోజ్ చేశారు. అందుకు సంబంధించిన సందేశాన్ని వదిలివెళ్లారు. ఈ విచిత్రమైన సంఘటన దక్షిణ గోవాలోని మార్గోవో పట్టణంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళ్తే.. అసిబ్ జిక్ అనే వ్యక్తి కుటుంబ సమేతంగా రెండు రోజులు బయటకు వెళ్లాడు. ఆ సమయంలో బాత్‌రూమ్ గ్రిల్ తెరిచి దొంగలు బంగ్లాలోకి చొరబడి నగదు ఎత్తుకెళ్లారు. మంగళవారం మధ్యాహ్నం అసిబ్ జిక్ తన కుటుంబంతో ఇంటికి తిరిగి వచ్చినప్పుడు... వారు టీవీని చూసి ఆశ్చర్యపోయారు. స్క్రీన్‌పై 'ఐ లవ్ యుు` అని రాసి ఉంది. కుటుంబసభ్యులు అన్ని గదులను పరిశీలించగా అంతా చిందరవందరగా పడి ఉన్నాయి. అప్పుడే వారికి ఏం జరిగిందో అర్థమైంది. 9 జతల బ్యాంగిల్స్, ఒక గొలుసు, రెండు నెక్లెస్‌లు, వెండి బిస్కెట్లు, బ్రాస్‌లెట్లు, లాకెట్లు, మంగళసూత్రం చోరీకి గురైనట్లు కుటుంబ సభ్యుడు ఒకరు తెలిపారు. మొత్తం రూ.20 లక్షల విలువైన బంగారం, వెండి అభరణాలతోపాటు రూ.1.5 లక్షల నగదు అపహరణకు గురైందని తెలిసింది. పోలీసులకు బాధితులు సమాచారం అందించగా వారు క్లూస్ టీంతో అక్కడకు చేరుకని పరిశీలించారు. బాధితుడు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ సచిన్ నార్వేకర్ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 25 May,2022 06:19PM