ఢిల్లీ: ఉగ్రవాదులు, ఉగ్రకార్యకలాపాలకు నిధులు సమకూర్చిన కేసులో దోషిగా తేలిన కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌కు పటియాలా కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. టెర్రర్ ఫండింగ్ కేసులో కఠినమైన చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఉన్న ఆరోపణలతో సహా అన్ని అభియోగాలను ఇంతకుముందు అంగీకరించిన యాసిన్ మాలిక్‌కు మరణశిక్ష విధించాలని కోర్టుకు ఎన్‌ఐఏ సూచించింది. అయితే న్యాయమూర్తి ప్రవీణ్ సింగ్ మాత్రం యాసిన్ మాలిక్‌కు జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు.
కశ్మీర్‌లో ఫ్రీడమ్ స్ట్రగుల్ పేరుతో మాలిక్ ఉగ్రవాదులకు నిధులు సమకూర్చాడు. ఈ కేసులో యాసిన్ మాలిక్‌తో పాటు లష్కర్ ఎ తొయిబా వ్యవస్థాపకుడు హఫిజ్ సయీద్, హిజ్బుల్ ముజాహిదీన్ నాయకుడు సయ్యద్ సలాహుద్దీన్ పేర్లు కూడా ఎన్‌ఐఏ ఛార్జ్‌షీట్‌లో ఉన్నాయి. తనపై నమోదైన అన్ని కేసుల్లోనూ యాసిన్ మాలిక్ మే పదో తేదీన కోర్టు ఎదుట నేరాన్ని అంగీకరించాడు. మరోవైపు కోర్టు తీర్పు నేపథ్యంలో ఢిల్లీ, కశ్మీర్‌లో భారీగా భద్రతా ఏర్పాటు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 25 May,2022 06:25PM