హైదరాబాద్ : ఉత్తరాఖండ్లోని తెహ్రీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.ఓ బొలెరో వాహనం అదుపుతప్పి కాలువలో పడింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చంబా నుంచి ఉత్తరకాశీ వైపు గంగోత్రి జాతీయ రహదారిపై బొలెరో వాహనం వెళ్తున్నది. ఈ క్రమంలో కోటిగడ్డ సమీపంలో వాహనం అదుపు తప్పి కాలువలో పడింది. దాంతో వెంటనే వాహనం నుంచి మంటలు చెలరేగాయి.స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పందుకు యత్నించారు. కానీ, వాహనంలో ప్రయాణికులు అప్పటికే పూర్తిగా కాలిపోయి చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm