హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం ఉదయం బెంగళూరు పర్యటనకు వెళ్లనున్నారు. ఢిల్లీలో ఇటీవల దేశంలోని వివిధ పార్టీ నాయకులను, ప్రముఖులను సీఎం కేసీఆర్ కలిసి వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఢిల్లీ, ఛండీగఢ్ రాష్ట్రాల్లో పర్యటించారు. అయితే ఇంకా ఆయన పలువురు ప్రముఖులతో చర్చలు జరపాల్సి ఉండగా 23న అనూహ్యంగా హైదరాబాద్ వచ్చారు. అయితే తాజాగా గురువారం ఉదయం సీఎం కేసీఆర్ బెంగళూరు వెళ్లనున్నారు.
ఇదిలా ఉండగా ఉదయం కేసీఆర్ హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయలుదేరిన కాసేపటికే ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ చేరుకోనున్నారు. పలు కార్యక్రమాల్లో పాలుపంచుకునే నిమిత్తం ప్రధాని మధ్యాహ్నం 1.30 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టు చేరుకుంటారు. వారికి తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ స్వాగతం పలకనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 25 May,2022 07:07PM