అమరావతి : డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ అనంత బాబును పార్టీ నుంచి వైసీపీ సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపింది. ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి అతనికి జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. దాంతో అతన్ని రాజమండ్రి జైలుకు తరలించారు. అయితే అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని రెండు రోజులుగా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే చేసిన నేరాన్ని ఎమ్మెల్సీ ఒప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm