కౌలాలంపూర్: టాయిలెట్‌లో కూర్చొని వీడియోగేమ్ ఆడుతున్న ఓ వ్యక్తిని పాము కాటువేసింది. అయితే అది విష పూరిత పాము కాకపోవడంతో అతనికి ఏమీ కాలేదు. ఈ ఘటన మలేషియాలో జరిగింది.
వివరాల్లోకెళ్తే.. మలేషియాకు చెందిన 28 ఏండ్ల వ్యక్తి సబ్రీ తజలీకు టాయిలెట్‌లో కూర్చుని ఫోన్‌లో వీడియో గేమ్ ఆడే అలవాటు ఉంది. ఓ రోజు అలాగే ఆడుతున్నాడు. అయితే ఆ టాయిలెట్ బేసిన్‌లో ఉన్న పాము అతడి పిర్రను గట్టిగా కరిచి పట్టుకుంది. దాంతో పైకి లేచిన అతడు దానిని లాగి పడేసి భయంతో ఇంట్లోకి పరుగుతీశాడు. వెంటనే ఆస్పత్రికి వెళ్లగా వైద్యులు పరిశీలించారు. అది విషపూరిత పాము కాదని చెప్పారు. అయినప్పటికీ యాంటీ టెటానస్ ఇంజెక్షన్ ఇచ్చి చికిత్స చేశారు. మరోవైపు ఈ విషయం తెలిసిన పాము సంరక్షకులు ఆ ఇంటి బాత్ రూమ్‌లో దాగిన పామును సరక్షితంగా పట్టుకున్నారు. ఈ విషయాన్ని బాధితుడు ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. తన కుటుంబం 40 ఏండ్లుగా నివాసం ఉంటుందని.. తన హౌసింగ్ ఏరియాలో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి అని చెప్పాడు. దాదాపు రెండు నెలల క్రితమే ఈ ఘటన జరిగినా.. షాక్ నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నానని పేర్కొన్నాడు. ఈ ఘటన తర్వాత రెండు వారాల వరకు తన టాయిలెట్ రూమ్‌కు వెళ్లలేదని చెప్పాడు. బయట టాయిలెట్ ను ఉపయోగించు కున్నానని వెల్లడించాడు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 25 May,2022 08:05PM