హైదరాబాద్ : హైదరాబాద్ లో మరో సైబర్ క్రైమ్ వెలుగు చూసింది. ఎంబీబీఎస్ సీటు పేరుతో ఓ యువతి కుటుంబ నుంచి ఏకంగా రూ.10 లక్షలు కాజేశారు కేటుగాళ్లు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబర్ క్రైం పోలీసులు.. బిహార్కు చెందిన ఏడుగురు ముఠా సభ్యులు ఈ నేరాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు.ఈ మేరకు ఒకరిని అదుపులోకి తీసుకోగా మరో ఆరుగురు నిందితులు పరారీలో ఉన్నారు.
పూర్తి వివరాల్లోకెళ్తే.. హైదరాబాద్కు చెందిన ఓ యువతికి నీట్ కౌన్సెలింగ్లో మెడికల్ సీట్ రాలేదు. అయితే తక్కువ ధరకు బెంగళూరులోని కెంపెగౌడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో సీట్టు ఇప్పిస్తామని యువతి ఫోన్కు ఓ సందేశం వచ్చింది. దాంతో యువతి తల్లిదండ్రులు సీటు కోసం అతను ఆడిగిన రూ.10.16లక్షల రూపాయలను అతని ఖాతాలో జమ చేశారు. తర్వాత సీటు రాకపోవడం, డబ్బు తీసుకున్న వ్యక్తి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయామని గ్రహించిన వారు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో బిహార్కు చెందిన నిందితుడు అశోక్షా నేపాల్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బోర్డర్ పోలీసుల సాయంతో అతన్ని అరెస్ట్ చేసి నగరానికి తీసుకొచ్చారు. నిందితుడి వద్ద నేపాల్ గుర్తింపు కార్డులు కూడా ఉన్నట్లు సీసీఎస్ జాయింట్ సీపీ గజరావు భూపాల్ తెలిపారు. మరొ ఆరుగురు నిందితులు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 25 May,2022 08:18PM