హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో వాహనాల వేగ పరిమితిని పెంచుతూ నగర పోలీసు కమిషనర్ కార్యాలయం బుధవారం నిర్ణయం తీసుకుంది. ఇప్పటిదాకా జీహెచ్ఎంసీ పరిధిలో అన్ని రకాల వాహనాల వేగ పరిమితి గంటకు 40 కిలో మీటర్లుగా ఉంది. ఈ వేగాన్ని మించితే ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధిస్తున్నారు. అయితే తాజాగా ఈ వేగ పరిమితిని పెంచడంతో పాటుగా ఆయా వాహనాల వేగ పరిమితులను వేర్వేరుగా నిర్ణయించారు. డివైడర్లు ఉన్న చోట (డబుల్ లేన్) కార్లు గంటకు 60 కిలో మీటర్ల వేగంతో వెళ్లేందుకు అనుమతించారు. అలాగే ఆ ప్రాంతాల్లో బస్సులు, బైకుల స్పీడును మాత్రం గంటకు 50 కీలోమీటర్లుగా నిర్ణయించారు. ఇక నగర పరిధిలో డివైడర్లు లేని చోట కార్ల వేగాన్ని గంటకు 50 కీలో మీటర్లుగా నిర్ణయించగా.. బస్సులు, బైకుల వేగం మాత్రం గంటకు 40 కీలో మీటర్లుగా నిర్ణయం తీసుకున్నారు. ఇక కాలనీల్లో అన్ని రకాల వాహనాల వేగం 30 కిలో మీటర్లకు మించరాదని పోలీసు శాఖ తెలిపింది.
Mon Jan 19, 2015 06:51 pm