హైదరాబాద్ : తెలంగాణలోకు పెట్టుబడులకు అనేక కంపెనీలు ముందుకు వస్తున్నాయి. దావోస్ వేదికగా తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తున్నారు. ఈ క్రమంలో స్విట్జర్లాండ్‌కు చెందిన ఫెర్రింగ్ ఫార్మా కంపెనీ ప్రతినిధులు బుధవారం మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. అనంతరం తన రెండో యూనిట్‌ను హైదరాబాద్ లో ప్రారంభించేందుకు సిద్ధమైనట్టు ఫెర్రింగ్ ఫార్మా కంపెనీ ప్రకటించింది. రానున్న రెండు మూడేండ్లలో రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు ప్రకటించింది. ఈ సందర్భంగా ఫెర్రింగ్ ఫార్మా కంపెనీ ప్రతినిధులకు కేటీఆర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు దాదాపు నెల క్రితమే హైదరాబాద్‌లో తమ ఉత్పత్తులను ప్రారంభించిన ఈ కంపెనీ.. ఇప్పుడు రెండో యూనిట్‌ను నెలకొల్పాలని నిర్ణయించింది.
Mon Jan 19, 2015 06:51 pm