హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ లో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఖాళీ అయిన నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఈసీ ఉప ఎన్నిక షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఆత్మకూరుతో పాటు దేశంలోని 10 రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదలైంది.
ఈ షెడ్యూల్ ప్రకారం ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు ఈ నెల 30న నోటిఫికేషన్ జారీ కానుంది. నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచి జూన్ 6 వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంటుంది. జూన్ 9 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఆ తర్వాత జూన్ 23న పోలింగ్ నిర్వహిస్తారు. జూన్ 26న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాన్ని వెల్లడిస్తారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 25 May,2022 08:50PM