హైదరాబాద్ : హైదరాబాద్‌లోని చార్మినార్ లాడ్‌బజార్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. రెండంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. అగ్నిప్రమాదంలో ఓ దుకాణం పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm